- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు సీఎంకు కాళేశ్వరం నివేదిక
'కాళేశ్వరం' అనుబంధ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : 'కాళేశ్వరం' అనుబంధ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Justice Pinaki Chandraghosh) నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డు కవర్‌లో నివేదికను అందజేశారు. కాగా ఈ నివేదికను రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy) అందజేయనున్నారు. కాళేశ్వరం కమిషన్ అందజేసిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం.
అయితే ఆగస్టు మొదటి వారంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఢిల్లీ పోరుబాట ఉన్నందున, ఆగస్టు 10 తర్వాత మంత్రివర్గ సమావేశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు కమిషన్ సమర్పించిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 15 నెలలపాటు మొత్తం 119 మందిని కమిషన్ విచారించి తయారు చేసిన నివేదికలో గత ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొందని సమాచారం. నివేదిక ప్రకారం గత పాలకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.






