- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద కుంభకోణం.. మంత్రి వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఓవర్సీస్స్కాలర్షిప్తో విదేశాలకు వెళ్లుతన్న 18 మంది యువకులకు శిక్షణ పొందిన పత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పించడమే మా ఉద్దేశమని, స్కిల్ డెవలపెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. డిగ్రీ, బీటెక్కోర్సులు చదివిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జర్మనీ పంపుతున్నామని తెలిపారు. స్కిల్స్ఉంటే మార్కెట్లో ఉద్యోగాలు వస్తాయని ప్రైవేటు కంపెనీలు నైపుణ్యం ఉన్న యువతను తీసుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. విదేశాలకు వెళ్లితే అక్కడ ఏవిధంగా ఉండాలని, అక్కడ వ్యక్తులతో ఏట్లా ప్రవర్తించాలనే విషయాలను శిక్షణలో నేర్పరిస్తారని చెప్పారు. కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో స్కిల్స్పెంపొందించాల్సిన బాధ్యత అడ్డాన్స్డ్ ట్రైనింగ్శిక్షణ నిర్వహకులపై ఉందన్నారు. 46 ఏటీసీలు ఏర్పాటుచేసి వాటిలో 98 శాతం ఆడ్మిషన్లు పూర్తి చేశామన్నారు. టామ్కామ్సంస్ధతో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు కీలక ఒప్పందం చేసుకున్నామని భారత్‌నుంచి వచ్చే నెల ఉపాధి కోసం జర్మనీకి 18 మంది విద్యార్ధులను పంపిస్తున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి కాళేశ్వరం నిర్మాణం
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను చాలా సందర్బాల్లో చెప్పినట్లు తెలిపారు. మల్లన్న సాగర్ ఒక పెద్ద కుంభకోణమని దాని గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదని కొట్టి పారేశారు. మల్లన్న సాగర్ కు ఎల్లంపల్లి నుంచే వస్తున్నాయని కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కట్టారు. రెండు రోజుల కితం సీఎం రేవంత్ రెడ్డి చేసిన భూమి పూజ ఒరిజినల్ ప్రాజెక్టు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పై కేటీఆర్ కు అవగాహన లేదని, విదేశాల్లో చదుకున్న వ్యక్తిగా మాట్లాడట తప్ప తనకంటే ఆయకు ఏమి తెలియదన్నారు. కమిషన్ల కోసమే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేపట్టారని, పాత ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కు నీళ్ళు వస్తున్నాయన్నారు.






