kaleshwaram: kaleshwaram: కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

by Prasad Jukanti |   (  Updated:2025-05-19 10:17:28  IST  )

కాళేశ్వరం కమిషన్ గడువు ను తెలంగాణ ప్రభుతం మరోసారి పొడిగించింది.

kaleshwaram: kaleshwaram: కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ (Justice P Ghosh) కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓ వైపు ఈ విచారణ తుది దశకు చేరుకున్నదని త్వరలోనే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ ఈసారి ఏకంగా రెండు నెలల పాటు పొడింగించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.

కేసీఆర్ ను విచారించబోతున్నారా?

కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజినీర్లు, అధికారులను కమిషన్ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించింది. ప్రస్తుతం కేసు విచారణఫైనల్ స్టేజీకి వచ్చిందని, తది నివేదికను సిద్ధం చేసే పనిలో కమిషన్ బీజీ బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గడువు పెంచిన నేపథ్యంలో కేసీఆర్ (KCR) సహా నాటి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన పలువురు కీలక నేతలను విచారణకు ఏమైనా పిలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Next Story