Kaleswaram: ‘కాళేశ్వరం’ కమిషన్‌ గడువు పెంపు

by Prasad Jukanti |   (  Updated:2025-04-29 08:11:47  IST  )

కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది.

Kaleswaram: ‘కాళేశ్వరం’ కమిషన్‌ గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును (pc ghose commission term extended) తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ ఏడాది మే 31 వరకు గడువు పెంచుతూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 100రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని తొలుత 2024 మార్చి లో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆయా కారణాలతో విచారణ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో గడవు పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పెంచింది. ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరుకుంది. దాదాపు 90 శాతం నివేదిక సైతం కమిషన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తుది దశ విచారణలో భాగంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది.

Next Story