- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం కమిషన్ నివేదిక సిద్ధం.. ఇక గులాబీ బాస్‌కు నోటీసులే తరువాయి!
కాళేశ్వరం కమిషన్ విచారణలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. తుది నివేదిక ఇప్పటికే సిద్ధం అవ్వగా.. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలిసింది. సరిగ్గా ఇదే టైంలో మరో రెండు నెలలు కమిషన్ గడువు పొడిగించడం రాజకీయ, నీటిపారుదల శాఖ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాళేశ్వరం బ్యారేజీల్లో నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ల పాత్ర ఉన్నదని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులు కమిషన్‌కు చెప్పినట్టు సమాచారం. బ్యారేజీల ఖరారు, స్థలాల మార్పు, నీటి నిల్వ తదితర విషయాలన్నీ కేసీఆర్సూచించిన విధంగానే తాము చేసినట్టు వివరించినట్టు టాక్.
ఏకపక్ష రిపోర్టు కావొద్దని..
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులందరూ కమిషన్ ముందు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కాళేశ్వరం డ్యామేజీకి కేసీఆరే ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధం అయింది. నేడో, రేపో ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ వివరణ తీసుకోకుండా నివేదిక రూపొందించడం ఏకపక్షం అవుతుందని భావించి కమిషన్.. ఆయన వాదనను తీసుకున్నాకే తుది నివేదిక ఫైనల్ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్, హరీశ్ రావు, ఈటల వాదనలు వినకుండా ఏకపక్షంగా రిపోర్టు ప్రభుత్వానికి అందితే.. వారు కోర్టుకు వెళ్లే అవకాశముంది.
సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా తమ వాదనలను వినకుండా తమను దోషులుగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసే చాన్స్ లేకపోలేదు. దీంతో ఆ ముగ్గురికి నోటీసులు ఇచ్చి వారి వాదనలను సైతం వినాలనికమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలల గడువును పొడిగించిందని అధికార వర్గాల సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. జస్టిస్పీసీ ఘోష్ఈ నెల 22వ వరకు రాష్ట్రంలో ఉండనున్నారు. అంతలోపే ముగ్గురికీ నోటీసులు ఇచ్చి చాన్స్ ఉన్నది. కొంత సమయం ఇచ్చి వచ్చే నెలలో వారిని విచారించే అవకాశముంది.
అందుకే విచారణ
ఒకవేళ కేసీఆర్ సహా ఇతరులకు నోటీసులు ఇస్తే కమిషన్ ఏర్పాటునే వారు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో మాదిరిగా వ్యవహరిస్తే ఇన్నాళ్లు చేసిన విచారణ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. ఇప్పటివరకు వారికి నోటీసులు ఇవ్వడానికి కమిషన్ ఆలోచించినట్టు సమాచారం. కాగా, సహజ న్యాయసూత్రాన్ని విస్మరిస్తే పెద్ద సమస్య వస్తుందని భావించి నిపుణుల సూచించడంతో నోటీసులు ఇచ్చిన విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్.






