ఎమ్మెల్యేలకు కాళేశ్వరం కమిషన్ నివేదిక అందజేత.. కీలక అంశాలివే

by Naga Rani Yarlagadda |

రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ప్రారంభమవ్వగా.. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar) అసెంబ్లీలో రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టారు.

ఎమ్మెల్యేలకు కాళేశ్వరం కమిషన్ నివేదిక అందజేత.. కీలక అంశాలివే
X

దిశ, వెబ్‌డెస్క్: రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ప్రారంభమవ్వగా.. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar) అసెంబ్లీలో రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. నేడు సభలో కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)పై చర్చ జరగాల్సి ఉండగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనససభ సభ్యులకు 665 పేజీల కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రతులను అందజేశారు. ఆ నివేదికలో కాళేశ్వరం నిర్మాణంపై కీలక అంశాలను పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని, నిపుణుల కమిటీ సూచనలను పట్టించుకోలేదని కమిషన్ పేర్కొంది. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినపుడు అక్కడ భూగర్భ పరిస్థితుల్ని పట్టించుకోలేదని ఆరోపించింది. డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలు ఉన్నట్లుగా నివేదికలో కమిషన్ వివరించింది. అన్నారం బ్యారేజీలో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని, భద్రతా ప్రమాణాలను కూడా సరిగ్గా పాటించలేదని ఘోష్ నివేదిక తెలిపింది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగనుండగా.. అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై చర్చించాలని పట్టుపట్టనున్నట్లు తెలుస్తోంది.

Next Story