- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదలైన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కేసీఆర్ కీలక అభ్యర్థన
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు ఇవాళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు ఇవాళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరయ్యారు. ఈ మేరకు బీఆర్కే భవన్‌లో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీ చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ బహిరంగ విచారణను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. జలుబుతో తనకు స్వల్ప అనారోగ్యం ఉందని కమిషన్ చైర్మన్ చంద్రఘోష్‌కు కేసీఆర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఓపెల్ హాలులో ఫేస్ టూ ఫేస్ విచారణ కాకుండా.. వ్యక్తిగతంగా వన్ టూ వన్ ఇన్ కెమెరా విచారణను ఆయన కోరారు. కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పీ చంద్రఘోష్ ఓపెన్ కోర్టు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపించారు. విచారణ ముగిసేందుకు 30 నిమిషాలు సమయం పడుతుందని చెబుతున్నప్పటికీ.. గంటకు పైగా టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






