- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో దేశ వస్త్ర పరిశ్రమకు మరింత ఊతం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఈ నెల 10న ప్రారంభించనున్న ప్రధాని మోదీ! రూ. 6 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా, దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్‌గా ఇది అవతరించనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చి హైదరాబాద్ నుంచి ఈనెల 10వ తేదీన వర్చువల్‌గా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రారంభిస్తారని వెల్లడించారు. శనివారం ఎక్స్‌వేదికగా వివరిస్తూ అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ పార్కు టెక్స్‌టైల్ హబ్ గా మారనుంది. ఈ పార్కు ద్వారా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులు మరింతగా వృద్ధి చెందడంతో పాటుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
రూ.𝟏,𝟔𝟗𝟓.𝟓𝟒 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా ఉందని, ఇప్పటికే రూ. 𝟑,𝟖𝟎𝟎 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు.1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఎంపికైందన్నారు. ఫామ్ టు ఫైబర్’, ఫైబర్ టు ఫ్యాక్టరీ’, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్’, ఫ్యాషన్ టు ఫారిన్’ అనే మోడీ 5ఎఫ్ విజన్‌ను ఈ మెగా టెక్స్ టైల్ ప్రతిబింబించనుందని తెలిపారు.






