Kailash Satyarthi: యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు: కైలాస్ సత్యార్థి

by Prasad Jukanti |   (  Updated:2025-12-08 09:03:21  IST  )

యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతాలు చేస్తున్నారని కైలాస్ సత్యార్థి అన్నారు.

Kailash Satyarthi: యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు: కైలాస్ సత్యార్థి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీ, నెహ్రూ మార్గంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలన నడుస్తోందని ప్రముఖ బాలల హక్కుల ఉద్యమకారుడు, నొబెల్ బహుమతి గ్రహిత కైలాష్ సత్యార్థి (Kailash Satyarthi) అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక విజన్ దిశగా ముందుకు వెళ్తోందని ఈ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజయవంతమైందని అన్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడిన ఆయన నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని పాలసీలు తేవాలని తొలి ప్రధాని నెహ్రూకు గాంధీజీ దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేశారని విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషిచేస్తున్నారని చెప్పారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని, 2047 లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ మారుతుందన్నారు. సంస్కృతి, కళలు టెక్నాలజీ, పరిశ్రమల హబ్ గా తెలంగాణ అవతరించబోతున్నదని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అసాధ్యమని అన్నారని కానీ సమస్యలకు ప్రతి భారతీయుడూ ఒక పరిష్కారం చూపిస్తాడని తాను చెప్పానన్నారు. ఐకమత్యం, శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మనం యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తామన్నారు.

Next Story