- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడియం శ్రీహరి విచారణ వాయిదా.. సాక్ష్యాధారాలు సమర్పించిన వివేకానంద
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపు కేసులో విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవ్వగా.. ఇప్పటికే 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపు కేసులో విచారణకు హాజరయ్యారు. ఆయనపై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా విచారణకు హాజరై తన వాదనలు వినిపించగా.. స్పీకర్ వాటిని రికార్డ్ చేశారు. తనవద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్ కు అందించారు. మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలు అన్నీ పూర్తయ్యాక ఈనెల 19న మరోసారి విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేశారు. అలాగే ఈనెల 18న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని రెండ్రోజుల క్రితం ఆదేశించారు. వీరిద్దరి విచారణ పూర్తయ్యాక అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దానం నాగేందర్ విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ లో చేరావని ఒప్పుకో..
కాగా... కడియం శ్రీహరి విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో పనిచేస్తూ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీతులు చెప్పడం ఆపి.. కాంగ్రెస్ లో చేరినట్లు స్పీకర్ ఎదుట అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ విచారణలో కాలయాపన చేస్తూ.. అనర్హత నుంచి ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.






