ఆ భూమి ప్రభుత్వానిదే అని కేసీఆర్‌కు కూడా తెలుసు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి(Kanche Gachibowli) రెవెన్యూ స‌ర్వే నం.25లో గల 400 ఎక‌రాల భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఆ భూమి ప్రభుత్వానిదే అని కేసీఆర్‌కు కూడా తెలుసు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి(Kanche Gachibowli) రెవెన్యూ స‌ర్వే నం.25లో గల 400 ఎక‌రాల భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని.. వేలం వేయడాన్ని ఆపాలని హెచ్‌సీయూ(HCU) విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజానికి ఆ భూములు పక్కాగా ప్రభుత్వానివే సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం వాదిస్తోది. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే కడియం శ్రహరి(Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని KCR చెప్పారని గుర్తుచేశారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వం కోర్టులోనూ కొట్లాడిందని.. ఇప్పుడు HCU భూమి అని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులున్నాయి.. రోజు గడవడం కూడా కష్టంగా ఉంది.. సంక్షేమ పథకాలు సక్రమంగా నడవాలంటే.. కొన్ని భూములు అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. కంచ గచ్చిబౌలి భూమి వేలం వేస్తే ఆదాయం వస్తుంది.. కొన్ని భూములు అమ్మి పథకాలు ఇస్తారేమో అని కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story