రాజీనామా చేయను.. కుండబద్దలు కొట్టిన కడియం శ్రీహరి

by Gantepaka Srikanth |

రాజీనామా చేయను.. కుండబద్దలు కొట్టిన కడియం శ్రీహరి

రాజీనామా చేయను.. కుండబద్దలు కొట్టిన కడియం శ్రీహరి
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యచరణ ప్రకటిస్తా అని అన్నారు. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. దేశ వ్యాప్తంగా తనకు ఒక గుర్తింపు ఉందని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు తండోప తండాలుగా తరలివస్తారని తెలిపారు. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అవడంతో ఇప్పుడు స్పీకరు ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొన్నది. కోర్టు విధించిన గడువులోపు ఎందరిపై వేటు వేస్తారు? ఎందరికి క్లీన్ చిట్ ఇస్తారు?అనే చర్చ జరుగుతున్నది. డిసెంబరు17 లోపు స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Next Story