కేసీఆర్, కేటీఆర్‌ ఇద్దరికీ విలువలు లేవు.. కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కేసీఆర్(KCR), కేటీఆర్‌(KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌ ఇద్దరికీ విలువలు లేవు.. కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్(KCR), కేటీఆర్‌(KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కానీ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. నవ్వొస్తుందని విమర్శించారు. ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. ఈ అంశంపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌లో ఎవరికీ లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ ఇద్దరికీ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలను విధ్వంసం చేశారని అన్నారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించామని సీజేఐ తెలిపారు.

Next Story