బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు : కడియం

by Muthe.Rajitha |

బీజేపీ(BJP)పై కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరి(Kadiyam Srihari) తీవ్ర విమర్శలు చేసారు.

బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు : కడియం
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP)పై కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరి(Kadiyam Srihari) తీవ్ర విమర్శలు చేసారు. స్థానిక సంస్థలు, విద్య, మరియు ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించే బిల్లులను తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆమోదించినప్పటికీ, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ బిల్లుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ, పార్లమెంట్‌లో ఈ బిల్లును చట్టబద్ధం చేయడానికి ఈ రెండు పార్టీలు సహకరించడం లేదని విమర్శించారు. ఈ బిల్లులు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని, కానీ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు "గారడి పనులు" చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుక నిర్ణయించిందని, ఈ బిల్లులకు అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు లభించినప్పటికీ, కేంద్రం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Next Story