ఇప్పుడు నేను మాట్లాడేది ఏం లేదు..స్పీకర్ విచారణపై శ్రీహరి

by Prasad Jukanti |

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం విచారణ పూర్తి. స్పీకర్ తీర్పు రిజర్వ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇప్పుడు నేను మాట్లాడేది ఏం లేదు..స్పీకర్ విచారణపై శ్రీహరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లకు సంబంధించి స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లకు సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఎలాంటి తీర్పు రాబోతోందనే ఉత్కంఠ స్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. అనర్హత పిటిషన్ స్పీకర్ పరిధిలోని అంశం అన్నారు. విచారణ జరిగింది. నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏం లేదన్నారు. వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం వెలువరిస్తే అందుకు మీరు సిద్ధమేనా అంటూ మీడియా వేసిన ప్రశ్నకు బదులిస్తూ తీర్పు రిజర్వ్ చేయబడిందని ఊహించి మాట్లాడటం దేనికన్నారు.

క్లీన్ చిటా? అనర్హత వేటా?:

కడియం, దానం పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెలువరించాల్సి ఉన్న నేపథ్యంలో వీరిద్ధరికి క్లీన్ చిట్ ఇస్తారా లేక అనర్హత వేటు వేస్తారా అనేది ఆసక్తిగా మారింది. వీరికి సంబంధించిన పిటిషన్ల సందర్భంగా కడియం శ్రీహరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రచారం చేయడం, ఎంపీ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‍సభకు పోటీ చేసిన ఆధారాలను స్పీకర్ కు సమర్పించినట్ల బీఆర్ఎస్ చెబుతోంది. వీరిపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం 10 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా ఇందులో 8 మందికి ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు దానం, కడియం కూడా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు. దీంతో వీరి విషయంలో ఏం జరగబోతోంది? అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.

Next Story