- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి కవిత అరెస్ట్ కావడమే కారణమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వాళ్లది ఆస్తి పంపకాలకు సంబంధించిన వివాదమే అని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి కవిత అరెస్ట్ కావడమే కారణమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వాళ్లది ఆస్తి పంపకాలకు సంబంధించిన వివాదమే అని ఆరోపించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ దోచుకుందని అన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని భూములన్నింటినీ కబ్జా చేశారని అన్నారు. కాళ్వేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పారు.
ఆ వేల కోట్లను పంచుకునే విషయంలోనే కల్వకుంట్ల కుటుంబంలో గొడవ జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణపై పడి ఆ కుటుంబం దోచుకుందని అందుకోసమే వాళ్లను ప్రజలు పక్కన పెట్టారని అన్నారు. వాళ్ల గొడవలతో ప్రజలకు సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదని అన్నారు. అది కేవలం ఆస్తుల గొడవ మాత్రమే అని స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమణించాలని చెప్పారు. కవిత ఆనాడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యిందని అందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.






