రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు కూడా ఏఐ అంటావా?.. కడియంపై వివేకా ఆగ్రహం

by Prasad Jukanti |

నేను కాంగ్రెస్‍లో చేరినట్టు వచ్చిన వీడియోలు, ఫోటోలు AI ఆర్టీ ఫీషియల్‍వి అని కడియం శ్రీహరి వింత వాదన చేస్తున్నారని కేపీ వివేకా ఆరోపించారు.

రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు కూడా ఏఐ అంటావా?.. కడియంపై వివేకా ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల విషయంలో స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda ) హాట్ కామెంట్స్ చేశారు. స్పీకర్ ముందు కడియం వింత వాదన చేస్తున్నారని దుయ్యబట్టారు. కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ స్పీకర్ ఎదుట విచారణకు కడియం హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేపీ వివేకా.. కడియం శ్రీహరి వాదనలపై విమర్శలు గుప్పించారు. నేను కాంగ్రెస్‍లో చేరినట్టు వచ్చిన వీడియోలు, ఫోటోలు AI ఫోటోలు, వీడియోలు అని కడియం అంటున్నారని, సిగ్గులేకుండా నేను ఇంకా బీఆర్ఎస్‍లొనే ఉన్నట్లు వాదిస్తున్నారని మండిపడ్డారు. కడియం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పార్టీ మారినట్టు వచ్చినవన్నీ తప్పుడు కథనాలని చెప్పాడని రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు కూడా ఏఐ ఫోటోలేనని చెప్పారని ఆరోపించారు. రాజకీయంగా కడియం శ్రీహరి సమాధి కాక తప్పదని హెచ్చరించారు.

Next Story