- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేఏ పాల్ లేఖ
ఇటీవల నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ డీవై.చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఈ లెటర్ నే సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ ప్రారంభోత్సవం కేసీఆర్ బర్త్ డే రోజు ప్రారంభం కాకుండా ఆపగలిగామన్నారు. అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14 రోజే ప్రారంభించాలని, లేదా వేరే రోజైనా ప్రారంభించాలని అన్నారు. ఈ అంశంపై హైకోర్టులో పిల్ వేసి న్యాయ పోరాటం చేశామని గుర్తుచేశారు.
దీంతో ప్రభుత్వం ఈ అంశంపై ఒక అడుగు వెనక్కి వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే 17 రోజు సెక్రటేరియట్ ప్రారంభోత్సవంను వాయిదా వేసిందని తెలిపారు. కేసీఆర్ తన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికల కోడ్‌ను తీసుకవచ్చి వాయిదా వేశారని ఆరోపించారు. నూతన సచివాలయంలో అసలు ఏం జరిగింది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలుకునేదాకా న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. నూతన సెక్రటేరియట్ వాయిదా వేయడంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గెలిచారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోయారని విమర్శించారు.






