KA Paul: మహిళల రక్షణపై హైకోర్టులో కేఏ పాల్ కీలక వాదనలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-17 11:36:21  IST  )

మహిళలపై దాడుల(Women's protection) నివారణకు.. రక్షణ చర్యలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు(High Court)లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కీలక వాదనలు వినిపించారు.

KA Paul: మహిళల రక్షణపై హైకోర్టులో కేఏ పాల్ కీలక వాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలపై దాడుల(Women's protection) నివారణకు.. రక్షణ చర్యలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు(High Court)లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కీలక వాదనలు వినిపించారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ కోర్టులో ఆయన తన వాదనలు వినిపించారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అత్యాచార బాధితులైన మహిళలను, బాలికలను 7 దశల ప్రణాళికతో ఎలా రక్షించాలో తాను చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించడం జరిగిందని వెల్లడించారు. 150కోట్ల మంది జనాభాలో 75కోట్ల మందికి పైగా మహిళలు, బాలికలు ఉన్నారని, వీరిలో 19కోట్ల మంది అత్యాచారాలు, దాడులకు గురవుతున్నారని, చిన్నారులు సైతం లైంగిక దాడుల బారిన పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా కమిషన్లు ఈ సమస్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మహిళ చట్టాలపై హోంశాఖ ఏడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.

మహిళలను, చిన్నారులను కాపాడటంలో కోర్టులే చొరవ తీసుకోవాలన్నారు. మహిళలపై దాడుల నివారణకు ఏడు దశల చర్యలను తాను కోర్టుకు సూచించారన్నారు. ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయాలి, 30రోజుల్లో చార్జీషీట్, మూడు నెలల్లో కఠినంగా శిక్షించాలని, లైంగిక బాధితులకు నిందితులు 50శాతం ఆస్తులు లేక పరిహారం చెల్లించేలా చేస్తే 95శాతం అత్యాచారాలను నివారించవచ్చని వాదించానన్నారు. మహిళా రక్షణ చర్యల కేసులో ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సర్పంచ్ ఎన్నికలు, కేంద్రానికి జమిలి ఎన్నికల పట్ల..దోచుకోవడం, దాచుకోవడం, ఎన్నికల్లో గెలవడం పట్ల తప్పా మహిళల రక్షణ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని, అందుకే వారు మహిళల రక్షణ కేసుల్లో కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్నారని చెప్పడం జరిగిందన్నారు.

నన్ను అల్లు అర్జున్ కేసులో కూడా మీరు స్పందించినట్లున్నారని కోర్టు గుర్తు చేసిందని, ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని తాను కోరడం జరిగిందని చెప్పినట్లుగా కేఏ పాల్ చెప్పుకొచ్చారు. మహిళలు, రైతులు, హోంగార్డులు, నిరుద్యోగుల సహా సమాజంలోని అందరి సంక్షేమానికి తాను అన్ని రకాలుగా పోరాటాలను చేస్తున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు వచ్చాకా మరింత అప్పులు పెరిగాయని, ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే గతంలో వచ్చినట్లుగా 700కంపనీలు వస్తాయని, అభివృద్ధి, అందరి సంక్షేమం సాధ్యమవుతోందన్నారు.

Next Story