- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KA Paul: పాకిస్తాన్ వెళ్తున్నాను.. యుద్ధాన్ని ఆపేస్తా..! కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపుతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య (War) యుద్దాన్ని ఆపుతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (K.A. Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. (India, Pakistan) భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లు కేఏపాల్ అన్నారు. ఇటీవల రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులను కలిసినట్లు తెలిపారు. యుద్దాన్ని ఆపే శక్తి తనకే ఉందని వారు చెప్పినట్లు వివరించారు. దాడుల నేపథ్యంలో మే 10 శనివారం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ యుద్ధం ఆపే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో తను పాకిస్తాన్ వెళ్లినట్లు గుర్తుకు చేశారు. (Operation Sindoor) భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోందని వెల్లడించారు.
అదేవిధంగా ఏపీ మాజీ సీఎం జగన్ గురించి కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు క్రిస్టియన్ కాదని, జగన్ చిన్నజీయర్ స్వామి భక్తుడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయారని విమర్శించారు. ఇక పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేయాలంటూ తను హైకోర్టు కోరినట్లు తెలిపారు.






