- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భయపడకండి నేను చూసుకుంటా.. KA పాల్ భరోసా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump)కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul ) వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump)కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul ) వార్నింగ్ ఇచ్చారు. గురువారం పాల్ మీడియాతో మాట్లాడారు. తాను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను.. ఎవరితో పెట్టుకున్నా ట్రంప్ భారతీయులతో పెట్టుకోవద్దు.. ట్రంప్ నాకు మిత్రుడు కాబట్టి ముందు సూచన చేస్తున్నా అని కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ పౌరులకు ట్రంప్ బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిని ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా..? రేపిస్టులా..? అని అన్నారు. దమ్ముంటే మోడీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలి, విదేశాంగా మంత్రి జయశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చైనాను ఎదురించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నాడని విమర్శించారు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏమి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయులంతా కేఏ పాల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి అని పిలుపునిచ్చారు. అమెరికాలో భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
రేవంత్ ప్రభుత్వంపైనా కేఏ పాల్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ గలాన్ని విప్పాలని సూచించారు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. చంద్రబాబు, పవన్, లోకేష్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ పెద్దలు కూడా నన్ను కలుస్తారు.. రాజకీయపరమైన సలహాలు తీసుకుంటారు. మరి జగన్ ఎందుకు కలవరు? అని కేఏ పాల్ ప్రశ్నించారు.






