- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది.. KA Paul సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ రాజకీయ వ్యభిచారి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ రాజకీయ వ్యభిచారి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏ పార్టీ గెలుస్తుందని తెలిస్తే.. ఆ పార్టీ వంచన చేరి డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి అని ఫైర్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను ఆ పార్టీ మిత్ర పక్షాలను మరింత వీక్ చేసేందుకు కేసీఆర్ ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లోని కొంతమంది వాడుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు పతనం మొదలైందని అన్నారు. అక్టోబర్ 2న సికింద్రాబాద్ లోని జింఖాన గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్న ప్రపంచ శాంతి సభకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిందని, అయితే ఈ సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సమావేశానికి 200 దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు, వివిధ ప్రముఖులు రావడానికి సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. దేశంలో అధికార ప్రతిపక్ష నేతలను ఆహ్వానించామని చెప్పారు. ఈ సమావేశానికి వరుణ్ గాంధీని సైతం ఆహ్వానించామని చెప్పారు. అయితే ఈ సమావేశానికి రావొద్దని వరుణ్ గాంధీకి కేటీఆర్ ఫోన్ చేసి చెప్పారని, ఈ విషయం తనతో వరుణ్ గాంధీనే స్వయంగా వెల్లడించారని ఆరోపించారు. శాంతి సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసే వారు ఎవరైనా సరే వారికి దేవుడి శాపానికి గురవుతారని, అలాగే వారు దేశానికి, రాష్ట్రానికి ద్రోహులుగా మిగులుతారని అన్నారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు కూడా పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ వచ్చే నెలలోనే ఎన్నికలు తీసుకువచ్చేలా ప్రశాంత్ కిశోర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. జైలుకు వెళ్లి వచ్చిన లాలు ప్రసాద్ యాదవ్ తో ఒరిగేదేమి లేదని, నితీష్ కుమార్ త్వరలో జైలుకు వెళ్తారని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారంతా జైలు పాలు అవుతారన్నారు.
- Tags
- KA Paul






