- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమిష ప్రియను విడిచిపెట్టాలని వేడుకున్న కేఏ పాల్
నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి తప్పించి విడిపించడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంతగానో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి తప్పించి విడిపించడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంతగానో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యెమెన్ వెళ్లి సనా నగరంలో హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీని కలిశారు. ఆయనతో పాటు నిమిష ప్రియ కుటుంబ సభ్యులను కలిసి వారితో మాట్లాడారు. నిమిష ప్రియను క్షమించి విడుదల చేయాలని పాల్ అల్ హౌతీని వేడుకున్నారు.
ఆమెను విడుదల చేయాలని నిమిష కుటుంబ సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశాడు. ఇదిలా ఉంటే కేరళకు చెందిన నిమిష ప్రియ వృత్తి రిత్యా నర్సు కాగా యెమెన్ దేశీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ఆ దేశంలోనే క్లినిక్ ప్రారంభించింది. కానీ ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో అతడు నిమిషపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరో వ్యక్తితో నిమిష కలిసి అతడికి మత్తుమందు ఇవ్వగా డోస్ ఎక్కువై మరణించాడు. ఈ కేసులో ఆమెకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించగా భారత్ విడిపించే ప్రయత్నం చేస్తోంది.






