- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన KA పాల్
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సీఈవో వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సీఈవో వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ పెద్ద డ్రామా నడుపుతున్నారన్నారు. అవినీతి చక్రవర్తిగా సీఈవో మారుతున్నారని ఫైర్ అయ్యారు. వికాస్ రాజ్‌పై చీఫ్ జస్టీస్‌కు కంప్లైంట్ చేశామన్నారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో వికాస్ రాజ్‌ను కొనేశారా..? అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దగ్గర డబ్బులు ఎందుకు సీజ్ చేయలేదన్నారు. హైదరాబాద్ ప్రజలు తన మాట విన్నారని.. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారన్నారు. కాంగ్రెస్ కు 58-63 సీట్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని.. వారిని ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Next Story






