త‌ప్పు చేసి డ్రామాలా.. నీకు బుద్ధి ఉందా? రౌడీ హీరోపై కేఏ పాల్ ఫైర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-06 14:30:50  IST  )

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈడీ విచార‌ణ త‌ర‌వాత విజ‌య్ దేవ‌ర‌కొండ పెద్ద యాక్ష‌న్ చేశాడ‌న్నారు.

త‌ప్పు చేసి డ్రామాలా.. నీకు బుద్ధి ఉందా? రౌడీ హీరోపై కేఏ పాల్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈడీ విచార‌ణ త‌ర‌వాత విజ‌య్ దేవ‌ర‌కొండ పెద్ద యాక్ష‌న్ చేశాడ‌న్నారు. చేసిన త‌ప్పును ఒప్పుకోకుండా లీగ‌ల్ అని మాట్లాడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య్ ప్ర‌మోట్ చేసిన యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ అయ్యింద‌న్నారు. ఆ యాప్స్ ప్ర‌మోట్ చేసినందుకు అరెస్ట్ చేయాల‌ని అన్నారు. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ వేరు వేర‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అంటున్నాడ‌ని, అవి రెండూ ఒక‌టేన‌ని ప్ర‌భుత్వానికి నిరూపించాన‌ని చెప్పారు.

విజ‌య్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రమోషన్స్ ద్వారా ఆయ‌న సంపాదించిన డబ్బును బెట్టింగ్ యాప్స్ వ‌ల్ల నష్ట‌పోయి ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న సురేష్ అనే వ్య‌క్తి కుటుంబానికి ఇవ్వాల‌న్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ గేమింగ్ యాప్స్ లీగ‌ల్ అని చెప్ప‌డం చ‌ట్ట విరుద్ధం అన్నారు. యువ‌త ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేస్తున్నావ్ అస‌లు బుద్ధి ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసిన న‌టుల్లో ఒక్క‌రిని కూడా విడిచిపెట్ట‌న‌ని హెచ్చ‌రించారు. యువ‌తకు తాను అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని వారి ప్రాణాలు కాపాడుతాన‌ని అన్నారు. 24 గంట‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని లేదంటే లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

Next Story