- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూండాలు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు..కేఏ పాల్ ఫైర్
హైదరాబాద్‌లో మీడియా ఛానల్ పై జరిగిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మీడియా ఛానల్ పై జరిగిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. కొంతమంది గూండాలు పత్రికల నోళ్లు మూయించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.రిపోర్టింగ్ నచ్చకపోతే ఫిర్యాదు చేయాలి లేదా కౌంటర్ ఇవ్వాలని అది ప్రజాస్వామ్య పద్ధతి అని పేర్కొన్నారు. హింసకు పాల్పడటం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.
2008లో మందకృష్ణ మాదిగ అనుచరులు ఏబీఎన్ పై దాడి చేశారని దానిని కూడా ఖండించానని చెప్పారు. గతేడాది మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ పై చేసిన దాడిని సైతం ఖండించానని అన్నారు. ట్రంప్ ఫాక్స్ న్యూస్ యాంకర్ మేగాన్ కెల్లిపై ఎక్కడి నుండో రక్తం వస్తుంది అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలను సైతం ఖండించానని చెప్పారు. నాయకులు బాధ్యతతో, గౌరవంతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని సూచించారు. పత్రికా స్వేచ్ఛనే ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. బెదింరిపు అణచివేత ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.






