- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరి భర్తలు అనిల్ లే, ఇద్దరి తండ్రులూ శేఖర్‌లే..కవిత, షర్మిలపై పాల్ షాకింగ్ కామెంట్స్
ఎమ్మెల్సీ కవిత, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. పదవులు, ఆస్తుల కోసమే అన్నలతో చెల్లెళ్లు కొట్లాడుతున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. పదవులు, ఆస్తుల కోసమే అన్నలతో చెల్లెళ్లు కొట్లాడుతున్నారని అన్నారు. షర్మిల పార్టీ పెట్టినప్పుడే ఆమె ఏదో ఒక పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని అన్నారు. అన్న పదవి ఇవ్వలేదని రావాల్సిన ఆస్తి లక్షల కోట్లు రాలేదని, తల్లి ద్వారా చర్చలు జరిపినా ఫలితం లేదని షర్మిల పార్టీ పెట్టిందన్నారు. కవిత కూడా అన్నకు పదవి ఇచ్చారు. కోట్ల ఆస్తులు ఇచ్చారు నాకు సమానంగా ఇవ్వాలనే కవిత గొడవ పెడుతుందని చెప్పారు.
ఇద్దరి భర్తల పేర్లు అనిల్ అని అన్నారు. అంతే కాకుండా షర్మిత తండ్రి పేరు రాజ శేఖర్ అని కవిత తండ్రి పేరు చంద్రశేఖర్ అని చెప్పారు. ఇద్దరికీ ఆశలు ఆకాశాలని అన్నారు. ఇలాంటి కుటుంబ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. బీసీలు 60 శాతం ఉంటే ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు. బడుగుబలహీన వర్గాలు 90 శాతం ఉన్నారని ఇంకా ఎందుకు మోసపోతారని అన్నారు. ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ అని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చే పార్టీ రెండు రాష్ట్రాల అప్పులు తీర్చే పార్టీ అని అన్నారు. కాబట్టి తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.






