- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాలు చేయవద్దు.. పాతబస్తీ అగ్నిప్రమాదంపై కేఏ పాల్ కామెంట్స్
పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సందర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ఘటనపై రాజకీయాలు చేయవద్దని కోరారు. ఫైర్ డిపార్ట్మెంట్ సరైన సమయంలో రాలేదని తన ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సి ఉందని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని అన్నారు. ప్రతిఒక్కరూ బాధిత కుటుంబం కోసం అన్ని మతాల వారు ప్రార్థించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయో చెప్పలేం అని అన్నారు. విచారణ తరవాతనే వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడగలం అన్నారు. మనదేశంలో శాంతి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిని నెలకొల్పడానికి ఈ నెల 24న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో సభను నిర్వహిస్తానని చెప్పారు. ప్రతిఒక్కరూ ఆ సభలో పాల్గొనాలని పాల్ పిలుపునిచ్చారు.






