నేను అధికారంలోకి వస్తేనే తెలంగాణ అప్పులు తీరుతాయి: కేఏపాల్

by Ajay Maddhiboyina |

జాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ఉన్న అప్పులు తీరుతాయని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీపై మీ స్పందన ఏంటి అని చాలా మంది మీడియా మిత్రులు అడుగుతున్నారని

నేను అధికారంలోకి వస్తేనే తెలంగాణ అప్పులు తీరుతాయి: కేఏపాల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ఉన్న అప్పులు తీరుతాయని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీపై మీ స్పందన ఏంటి అని చాలా మంది మీడియా మిత్రులు అడుగుతున్నారని అందుకే వీడియో చేస్తున్నానని చెప్పారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని కానీ ప్రజాశాంతి అధ్యక్షుడిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నానని అన్నారు. షర్మిల చేసినట్టే కవిత కూడా చేసే అవకాశం ఉందన్నారు. షర్మిల పార్టీ పెట్టి ఆ తరవాత కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. కవిత కూడా పార్టీ పెట్టి తన శక్తి చూపించుకుని ఆ పార్టీని కొనసాగించవచ్చు లేదా బీజేపీలో విలీనం చేయవచ్చని చెప్పారు.

లేదంటే ఆస్తుల కోసమే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు భయపెడుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఆస్తి మొత్తం ఇవ్వడంతోనే ఈ తగాదా మొదలైనట్టు తనకు వినిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిందని అన్నారు. అవినీతి తెలంగాణగా మారిపోయిందని చెప్పారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఎవరూ చేయకూడదు అని అన్నారు. తెలంగాణ అప్పు ఇప్పుడు 10 లక్షల కోట్లకు చేరుకుంది అని చెప్పారు. పాలన మారాలంటే పాల్ అన్న రావాలని అన్నారు. తను అధికారంలోకి వస్తేనే అడ్మినిస్ట్రేషన్ మారుతుందని చెప్పారు. ఇలా అప్పులు ఉండవని ఎందుకంటే తానే లక్షల కోట్ల రూపాయలు ప్రపంచానికి పంచిపెట్టానని అన్నారు.

Next Story