భారతీయ యువతే అత్యంత ప్రతిభావంతులు: కేఏపాల్

by Ajay Maddhiboyina |

భార‌తీయ యువ‌తే అత్యంత ప్ర‌తిభావంతుల‌ని తాను 40ఏళ్లుగా చెబుతున్నాన‌ని ప్ర‌జాశాంతిపార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. కానీ అవ‌కాశాలు లేక‌పోవ‌డం వల్ల మాత్ర‌మే ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు.

భారతీయ యువతే అత్యంత ప్రతిభావంతులు: కేఏపాల్
X

దిశ‌, వెబ్ డెస్క్: భార‌తీయ యువ‌తే అత్యంత ప్ర‌తిభావంతుల‌ని తాను 40ఏళ్లుగా చెబుతున్నాన‌ని ప్ర‌జాశాంతిపార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. కానీ అవ‌కాశాలు లేక‌పోవ‌డం వల్ల మాత్ర‌మే ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. ఐక్యంగా నిలిస్తే ఏదైనా సాధించ‌గ‌ల‌ర‌ని, అది ఈ రోజు నిరూపించార‌ని అన్నారు. కానీ అవినీతి రాజకీయనాయ‌కుల చేతుల్లో ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాను అంగీక‌రించినందుకు ప్ర‌ధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. యువ‌త డిమాండ్ల‌ను కూడా నెర‌వేర్చార‌ని అందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విద్యార్థులు ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని, గొప్ప భ‌విష్య‌త్ కోసం వేచి చూడాల‌ని చెప్పారు. ఇదిలా ఉంటే నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాజ‌కీయ‌నాయ‌కులు యువ‌త విజ‌యంపై ప్ర‌శంలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నాయ‌కులు యువ‌త పోరాటంపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ సోష‌ల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు.

Next Story