- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిలియన్ డాలర్స్ ఇస్తామని ఉరిశిక్ష ఆపా: కేఏ పాల్
మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషాను రక్షించడంలో 8 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మోడీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చెప్పారన్నారు. కానీ అది అబద్ధం అన్నారు. హూతీ సిటీలో ప్రభుత్వం ఉందని చెప్పారు. వాళ్లను తాను కలిశానని, మోస్ట్ పాపులర్ ముస్లీం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారని అన్నారు.
ఈ మిషన్ లో తనకు మూడు రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలు సాయం చేశారన్నారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా..తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని తాను మళ్లీ యెమన్ లీడర్లను కలుస్తానని కేఏ పాల్ చెప్పారు.






