- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇండిగో ఎయిర్‌లైన్స్’ బాయ్ కాట్ చేయాలి.. దాన్ని వదిలేదే లేదు.. తడాఖా చూపిస్తా: కేఏపాల్ ఫైర్
ఇండిగో ఎయిర్‌లైన్స్ బాయ్ కాట్ చేయాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (IndiGo Airlines) ఇండిగో ఎయిర్‌లైన్స్ (Boycott) బాయ్ కాట్ చేయాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (KA Paul) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. దాదాపు 18 ఏళ్లుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ నడుపుతున్నారని, తనలా ఎన్నో లక్షల మందికి ఫ్లైట్స్‌ను కాన్సిల్ చేసి మోసం చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. తను లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారని, దాన్ని క్లైమ్ చేస్తామని అన్నారు. తన వద్ద పాస్‌పోర్టు, గ్రీన్ కార్డు, టర్కీ వీసా, టికెట్లు ఉన్నాయని, అయినా కూడా తనను ముంబాయి ఎయిర్‌పోర్టులో ఎందుకు ఆపారని ప్రశ్నించారు. పాకిస్తాన్, భారత్, టర్కీ, అమెరికా లీడర్స్‌తో నేను యుద్దాలు ఆపడానికి మాట్లాడుతున్నాని వారికి తెలుసన్నారు. అయితే తన వద్ద నిన్న సరైన డాక్యుమెంట్స్ లేవని అంటున్నారని, నిన్న తెచ్చిన ఆవే పాస్‌పోర్టులు, డాక్యుమెంట్లను ఈ రోజు తెస్తే పోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు.
ఇలా ఎన్నో కోట్ల మందికి మోసం చేసి ఉంటారో.. మీ తడాఖా చూపిస్తా.. అని కేఏపాల్ ఫైర్ అయ్యారు. తనకు న్యాయం జరగడం కోసం అన్ని కోర్టుల చుట్టూ తిరిగుతానని, ఇండిగోను వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తను అమెరికన్ రెసిడెంట్ అని, తన కొడుకు అమెరికా సిటిజన్ ఉన్న వ్యక్తి అని ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయిందన్నారు. ఇండిగో చెత్త ఎయిర్‌లైన్స్ అని, ముంబాయి సిబ్బంది వ్యవహరించిన తీరు తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు. ఇక, టర్కీనే పాకిస్తాన్‌ను ఉసిగొల్పతుందని, భారత్‌పై దాడులకు మిస్సైల్ అందజేస్తుందని ఆరోపించారు. నిన్న పెద్ద మీటింగ్ అవుతుందని వారికి తెలుసని, తను టర్కీ నుంచి పాకిస్తాన్ పోతానని కూడా వారికి తెలుసన్నారు.






