ఫిబ్రవరి 17 వద్దు.. కేసీఆర్ నిర్ణయంపై హైకోర్టుకు కేఏ పాల్!

by Satheesh |   (  Updated:2023-02-02 12:29:02  IST  )

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు.

ఫిబ్రవరి 17 వద్దు.. కేసీఆర్ నిర్ణయంపై హైకోర్టుకు కేఏ పాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు. మొన్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. తాజాగా గురువారం తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీని మార్చాలని హైకోర్టును ఆశ్రయించారు. సచివాలయం సీఎం కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న కాకుండా అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని.. అందువల్ల ఆయన జయంతి రోజునే ప్రారంభించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్ ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్‌గా ఆయనే వాదనలు వినిపించబోతున్నారు. కాగా ఇందులో సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ఇటీవల కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వం ఫిబ్రవరి 13లోపు తన నిర్ణయాన్ని తెలపాలని ఆదేశించింది. ఈ కేసులోనూ పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.

Next Story