Sudarshan Reddy: సల్వాజుడుం తీర్పుపై అమిత్ షా విమర్శలు.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రియాక్షన్ ఇదే

by Prasad Jukanti |   (  Updated:2025-08-23 12:13:43  IST  )

అమిత్ షా ఆరోపణలపై ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు.

Sudarshan Reddy: సల్వాజుడుం తీర్పుపై అమిత్ షా విమర్శలు..  జస్టిస్ సుదర్శన్ రెడ్డి రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజం మద్దతుదారుడు అని, సల్వాజుడుంను నిషేధిస్తూ 2011లో ఆయన ఇచ్చివ తీర్పు వల్లే నక్సలిజం అంతానికి ఆలస్యం అవుతున్నదని కేంద్ర హోం శాఖ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు. అది తాను ఇచ్చిన తీర్పు కాదని సుప్రీంకోర్టు తీర్పు అని స్పష్టం చేశారు. తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆ తీర్పు నేనే రాశానని కానీ ఆ తీర్పు సుప్రీంకోర్టుదన్నారు. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నానని అయితే కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదన్నారు.

ఈ పోటీని ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో వ్యక్తిగత పోరాటంగా చూడకూడదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. రెండు భావజాలల మధ్య పోటీ అని వ్యక్తిగత దాడులు, ద్వేషం లేకుండా ఎన్నికలు గౌరవంగా నిర్వహించబడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇది యుద్ధం కాదని ఇది ఆలోచనల ఘర్షణ మాత్రమేనన్నారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలంతో విబేధిస్తున్నాను కానీ సీపీ రాధాకృష్ణన్ తో కాదన్నారు. తాను ఉదారవాద రాజ్యాంగ ప్రజాస్వామ్యవాదినని లౌకికవాదం, సామాజిక న్యాయం, బాబాసాహెబ్ భావజాలాన్ని నమ్ముతానన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం తాను ఎన్నడూ ఊహించని విషయం అని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో తొలుత సంప్రదించినది కాంగ్రెస్ పార్టీ అని విపక్షాలు తన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా ఒక పార్టీకి అభ్యర్థిగా ఉండటం నాకు కష్టమే కావచ్చు. కానీ భారత కూటమి అంగీకరిస్తే నేను పోటీ చేస్తానని చెప్పాన్నారు. సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story