CP రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభినందనలు

by Gantepaka Srikanth |

భారత ఉప రాష్ట్రపతి(Vice President of India)గా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan)కు ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy) శుభాంక్షలు చెప్పారు.

CP రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉప రాష్ట్రపతి(Vice President of India)గా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan)కు ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy) శుభాంక్షలు చెప్పారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప ప్రత్యర్థి, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంటు సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్‌ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.సి.మోడీ ప్రకటించారు. పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 67 ఏళ్ల రాధాకృష్ణన్‌ను ప్రధాని మోడీ సహా పలువురు అభినందించారు. తనకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులకు రాధాకృష్ణన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story