Central Budget: నిధులు వచ్చేలా తెలంగాణ బీజేపీ ఎంపీలు నోరు విప్పాలి: మంత్రి పొన్నం

by Prasad Jukanti |

Central Budget: నిధులు వచ్చేలా తెలంగాణ బీజేపీ ఎంపీలు నోరు విప్పాలి:  మంత్రి పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీకి (Narendra Modi) చిన్నచూపు ఉందని రాష్ట్ర పుట్టుకనే ఆయన అవమానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. ఈసారి కేంద్ర బడ్జెట్‍-2026 (Union Budget-2026) తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు వచ్చేలా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. బడ్జెట్ లో తెలంగాణకు ఏం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నామని కానీ మొండి చేయి చూపిస్తున్నారన్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రోకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలతో పాటు అనేక అంశాల్లో కేబినెట్ మంత్రులం కేంద్రాన్ని అడుగుతున్నా బీజేపీకి ఇసుమంతా చలనం లేదన్నారు. ఫెడరలిజానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పాటించడం లేదన్నారు.

మా ప్రతిపాదనలను అంగీకరించాల్సిందే:

రేపు ఆదివారం అయినప్పటికీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోందని రేపు పౌర్ణమి క కూడా ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తెలంగాణకు వెలుగులు తీసుకువస్తుందా లేక చీకట్లు తెస్తుందా చూడాలన్నారు. వివక్షకు గురవుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‍లోనైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీలు నోరు విప్పాలన్నారు. ఇక్కడ రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరం సమిష్టిగా బడ్జెట్ లో నిధులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కేంద్రం నుంచి ఏమీ అడగబోమని బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంగా మాట్లాడింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రంలో సయోధ్య కోరుకుంటోందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి కేంద్రం సహకరించాలని, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలన్నారు. బడ్జెట్‍లో మా ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించాల్సిందేనన్నారు.

Next Story