- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
317 జీవోతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలి.. 317 జీవో జేఏసీ డిమాండ్
నేటి నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశా్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన 317 జీవో అంశం పై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బాధితులకు న్యాయం చేయాలని 317 జీవో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు విజయకుమార్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నేటి నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశా్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన 317 జీవో అంశం పై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బాధితులకు న్యాయం చేయాలని 317 జీవో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు విజయకుమార్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడారు. దీనిపై క్యాబినేట్ సబ్ కమిటీ వేసి పూర్తి అధ్యయనం జరిపిందని, కాని ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు గత ప్రభుత్వం డిసెంబర్ 6, 2022 317 జీవో తీసుకొచ్చి వేలాది మంది ఉద్యోగులకు చీకటి రోజులను మిగిల్చిందన్నారు. ఆ తరుణంలో నాటి పీసీసీ అధ్యక్షులు అయిన రేవంత్ రెడ్డిని కలిసి 317 జాయింట్ యాక్షన్ కమిటీ తరపునవినతిపత్రం ఇచ్చామని ప్రస్తుతం సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ ఈ అంశం పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బాధగా ఉందన్నారు.
317 జీవో బాధితులుందరూ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడ్డామని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే న్యాయం చేస్తామని చెప్పారన్నారు.కానీ ఇప్పటికీ న్యాయం మాత్రం జరగలేదన్నారు. క్యాబి నెట్ సబ్ కమిటీ 8 నెలలలు సుదీర్ఘంగా చర్చలు జరిపి 13 సార్లు వివిధ శాఖలు, అధికారులు, మేధావులతో అన్ని రకాల చర్చలను జరిపిందన్నారు. కానీ రిపోర్టు మాత్ర బటయట పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అయిన దీనిపై ఒక నిర్ణయం తీసుకోకుని 20 వేల మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 317 జీవో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి.సందీప్ ,కన్వీనర్ పి .మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






