రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్.. కేసీఆర్, హరీశ్​, ఈటల విచారణ తేదీలు ఖరారు

by Ramesh Goud |

కాళేశ్వరం కర్త కర్మ క్రియగా అన్ని తానే అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్​రావును విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్​ నిర్ణయించింది.

రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్.. కేసీఆర్, హరీశ్​, ఈటల విచారణ తేదీలు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కర్త కర్మ క్రియగా అన్ని తానే అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్​రావును విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్​ నిర్ణయించింది. అయితే ఆయనను ఏ తేదీన విచారణకు పిలవాలి, అనేది సోమవారం దాదాపుగా నిర్ణయం కానుందని సమాచారం. కాళేశ్వరం కమిషన్​ విచారణలో భాగంగా జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ఆదివారం సాయంత్రం హైదరాబాద్​కు చేరుకున్నారు. సోమవారం ఉదయం కమిషన్​సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఏవరేవరికి నోటిసులు జారీ చేయాలని, ఏ తేదీన వారిని పిలిపించాలనే విషయాలను ఖరారు చేస్తారు. కేసీఆర్​విచారణతో కాళేశ్వరం విచారణ దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంజనీర్లు, నిపుణులు, అధికారులు అందరు కూడా కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం, వాటి స్థలం ఖరారు, నీటిని నిల్వ చేయడం తదితర అంశాలన్నింటిని కేసీఆర్​నిర్ణయం ప్రకారమే తాము ఫాలో అయ్యామని, నిబంధనలకు విరుద్దంగా ఉన్నా కూడా కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా తమ నిర్ణయాలను చేప్పే పరిస్థితి లేదని వారు కమిషన్​ముందు చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్​ విచారణపై రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కేసీఆర్​కూడా విచారణకు మానసికంగా సిద్దమైనట్లుగా సమాచారం. బ్యారేజీల నిర్ణయాన్ని ఏ విధంగా సమర్ధించుకోవాలి, అనే సమాచారాన్ని కూడా సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం. కేసీఆర్​తో పాటుగా అప్పటి సాగు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్​రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్​లను విచారణ కు పిలవాలని నిర్ణయించారు. అయితే వీరిని ఏ తేదీన విచారణ కు పిలచేతి తేల నుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పీసీ ఘోస్​కమిషన్​ గడువు ఉంది. ఇప్పటి వరకు విచాణ పూర్తి కాని వారిలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్​అండ్​టీ సంస్థ వైస్​ప్రసిడెంట్, కాగ్, విజిలెన్స్​అధికారులు విచారణకు హాజరుకావాల్సి ఉంది. వీరిని ఈ వారంలో పిలిచే అవకాశం ఉంది.

Next Story