Justice PC Ghosh: తుది దశకు కాళేశ్వరం విచారణ.. కేసీఆర్ అమెరికా టూర్ ప్లాన్ పై పొలిటికల్ హీట్!

by Prasad Jukanti |   (  Updated:2025-05-16 07:31:18  IST  )

కాళేశ్వరం కమిషన్ విచారణ రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది.

Justice PC Ghosh: తుది దశకు కాళేశ్వరం విచారణ.. కేసీఆర్ అమెరికా టూర్ ప్లాన్ పై పొలిటికల్ హీట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయవిచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh) విచారణ తుది అంకానికి చేరింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. 2 వారాల పాటు ఆయన హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండటంతో ఈ దఫాలోనే ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కీలకంగా మారిన ఫైనల్ రౌండ్..

ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజినీర్లు, అధికారులను కమిషన్ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించింది. ఈ దఫా మిగిలి ఉన్న అధికారులు, ఇతరులతోపాటు గత ప్రభుత్వ పెద్దలు, కీలక వ్యక్తులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు నివేదిక సిద్ధం చేస్తూనే మరోవైపు మిగిలిన విచారణనను కంటిన్యూ చేస్తోంది. బ్యారేజీల విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అందులో గత ప్రభుత్వ పెద్దల వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపింది. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

ఇటు విచారణ.. అటు కేసీఆర్ అమెరికా టూర్?..

ఓ వైపు కేసీఆర్ అమెరికా పర్యటనకు (KCR America Tour Plan) వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విచారణ కీలక దశలో ఉండగా ఆయన యూఎస్ టూర్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ పెద్దల తీరును ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆపేక్షించింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ సైతం త్వరలోనే కేసీఆర్‌ను విచారించనుందనే చర్చ జరుగుతోంది. విచారణకు పిలుస్తుందా? పిలిస్తే ఆయన హాజరవుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే కమిషన్ విచారణకు పిలిచేలోపు ఇక్కడే ఉంటారా లేక అమెరికా టూర్‌కు బయలుదేరే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

Next Story