కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం : ఎంపీ రేణుకా చౌదరి

by Taduka Kalyani |   (  Updated:2025-07-11 15:24:09  IST  )

స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అందరికీ సమ న్యాయం చేయాలని ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం :  ఎంపీ రేణుకా చౌదరి
X

దిశ, ఖమ్మం : స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అందరికీ సమ న్యాయం చేయాలని ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ రిజర్వేషన్ బిల్లు ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. మాజీ ప్రధాని రాహుల్ గాంధీ 33 శాతం రిజర్వేషన్ అమలు తీసుకొస్తే, రాహుల్ గాంధీ నాయకత్వంలో 42 శాతం రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ అయినా చేతి గుర్తు ప్రతి ఒక్కరికి అభయహస్తం గా ఉంటుందని ఆమె అన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గంటకు ఒక మాటలు మాట్లాడుతుందని, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో వాళ్లకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆమె తెలిపారు. అల్లుడు.. బిడ్డ.. కొడుకు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరికీ సామాజిక న్యాయం చేస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు ఆమె తెలిపారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని ఆమె తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానకొండరాధ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story