- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులను పరిశీలించిన జస్టిస్ చంద్రఘోష్
by Prasad Jukanti |
సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులను జస్టిస్ చంద్రఘోష్ పరిశీలించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బ్యారేజీల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న ఆ కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజీ (సుందిళ్ల)ని పరిశీలించారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయంలో చంద్రఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు చంద్రఘోష్ శుక్రవారం రాత్రే పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో బస చేశారు. ఇవాళ బ్యారేజీల సందర్శనకు వెళ్లారు.
Next Story






