ఒక్క ఫోన్ చేయండి చాలు.. రంగరాజన్ ట్వీట్ కు కొండా సురేఖ ఆసక్తికర రిప్లై

by Ramesh Goud |

ఒక్క ఫోన్ (Single Phone Call) చేయండి చాలు.. మేము ఉన్నాం అని చిల్కూరు ఆలయ ప్రధాన పూజారి (Chilkuru Temple Priest)కి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) భరోసా ఇచ్చారు.

ఒక్క ఫోన్ చేయండి చాలు.. రంగరాజన్ ట్వీట్ కు కొండా సురేఖ ఆసక్తికర రిప్లై
X

దిశ, వెబ్ డెస్క్:ఒక్క ఫోన్ (Single Phone Call) చేయండి చాలు.. మేము ఉన్నాం అని చిల్కూరు ఆలయ ప్రధాన పూజారి (Chilkuru Temple Priest)కి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెట్టిన ట్వీట్ కు చిల్కూరు పూజారి సీఎస్ రంగరాజన్ (CS Rangarajan).. మంత్రి కొండా సురేఖ తన హామీని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని తెలియజేశారని, ఇది తన తండ్రికి మనశ్శాంతిని ఇచ్చిందిని రిప్లై ఇచ్చారు. దీనికి కొండా సురేఖ స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె.. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ కు తాము అండగా (Support) ఉన్నామని భరోసా కల్పించారు. అలాగే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని విశ్వాసాల హక్కులను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతేగాక ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని, దయచేసి ఒక్క కాల్ (Single Call) లేదా ఒక్క మెసేజ్ (One Message) చేయండి మేము మీకు మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కాగా కొద్ది రోజుల క్రితం చిల్కూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో ఓ మూక ఆయనపై దాడి చేశారు.

దీనిపై ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో హిందువాదులు, ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజారి పై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి సహ మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రంగరాజన్ ను మంత్రి కొండా సురేఖ పరామర్శించేందుకు వెళ్లారు. దాడికి సంబంధించిన వివరాలపై ఆరా తీసి.. ఇలాంటి దాడులను సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story