తెలంగాణ ప్రజలను BRS పార్టీ మోసం చేసినట్లే.. సీపీఐ నారాయణ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది.

తెలంగాణ ప్రజలను BRS పార్టీ మోసం చేసినట్లే.. సీపీఐ నారాయణ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే వివిధ రాజకీయ పార్టీలు తమ మద్దుతు ఎవరికీ అనే విషయాన్ని ఇప్పటికే కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఇక రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (BRS) ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధినేతల కేసీఆర్ రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అయితే, ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radha Krishnan) పోటీపడుతుండగా.. ఇండియా కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి (Justice B Sudarshan Reddy) పోటీలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరిపై సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ (Narayana) తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో రెండో అత్యున్నత పదివికి ఎన్నికలు జరుగుతోన్న వేళ బీఆర్ఎస్ తటస్థ వైఖరి సరైంది కాదని కామెంట్ చేశారు. అలా చేయడం తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్లేనని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహకరించారని.. అది చూసైనా బీఆర్ఎస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుని తెలంగాణ బిడ్డకు సహరించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలను బాయ్‌కాట్ చేయడం ఆత్మహత్యాసదృశ్యమని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Next Story