- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలు కాదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఆ నేతలు డమ్మీలు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఆ నేతలు డమ్మీలు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడే హక్కు ఉందని అన్నారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఏ నాయకుడు డమ్మీ కాదని తెలిపారు. ఒకవేళ బండి సంజయ్ ఉన్నా.. లేకపోయినా.. పార్టీ కార్యకలాపాలు ఆగవని అన్నారు. కానీ, తమ పార్టీతో సంబంధం లేని వారు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చెబితే.. ఎంకెవరో చెబితేనో అధ్యక్షుడిని ఎంపిక చేయరని.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలా జరిగితే.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు (Naraparaju Ramchander Rao) పేరు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశాలు అందాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు రామచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.






