- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణ నదిపై హై లెవెల్ బ్రిడ్జి.. జీవో విడుదల
జూరాల ప్రాజెక్ట్‌పై కొనసాగుతున్న భారీ వాహనాల రాకపోకల వల్ల డ్యామ్‌కి నష్టం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించిన రాష్ట్ర..

దిశ, ప్రతినిధి జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్ట్‌పై కొనసాగుతున్న భారీ వాహనాల రాకపోకల వల్ల డ్యామ్‌కి నష్టం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించిన రాష్ట్ర నీటి పారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. గత నెల 28న జూరాల ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఆయన, త్వరలో జీవో విడుదల చేస్తామన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 292 ద్వారా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో ₹121.92 కోట్ల నిధులతో, జూరాల ప్రాజెక్ట్ దిగువన రేవులపల్లి (నీ ధరూర్ మండలం) నుంచి నందిమల్ల (అమరచింత మండలం, వనపర్తి) వరకు ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీనివల్ల భారీ వాహనాల రాకపోకలు జూరాల డ్యామ్ నుంచి దూరంగా కొనసాగనుండటంతో ప్రాజెక్ట్‌కు కలిగే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంది.
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
ఈ మేరకు జీవో విడుదల కావడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవడంపై ధన్యవాదాలు తెలుపుతూ, "జూరాల ప్రాజెక్ట్‌కు భద్రతా దృష్ట్యా ఇది సకాలంలో తీసుకున్న అతి కీలక నిర్ణయం" అని పేర్కొన్నారు.






