- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jurala: జూరాల ఘటనతోనైనా సీఎం, మంత్రులు మొద్దునిద్ర వీడాలి: కేటీఆర్
జూరాల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూరాల (Jurala) ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ (Congress) సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడిందని ధ్వజమెత్తారు. జూరాల గేట్ రోప్ తెగిపడటంపై ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ (CM Revanth Reddy) సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇకనైనా మొద్దు నిద్ర వీడాలన్నారు.
అసమర్థ ప్రభుత్వం:
ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, పెద్దవాగుకు గండి పడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. వట్టెం పంప్ హౌస్ ముంపు, సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పుకూలి వందల కోట్ల నష్టం సంభవించిందని విమర్శించారు. తాజాగా జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతో పాటు ఇతర గేట్ల రోప్ లు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జూరాల ప్రజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






