బృందావనం స్పిరిట్స్ డిస్టిలరీస్‌ తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

by Ajay Maddhiboyina |

మద్యం తయారీ, విక్రయాల్లో ప్రభుత్వ నియమావళిని కచ్చితంగా పాటించాలని, పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాన్ని ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ఆదేశించారు.

బృందావనం స్పిరిట్స్ డిస్టిలరీస్‌ తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మద్యం తయారీ, విక్రయాల్లో ప్రభుత్వ నియమావళిని కచ్చితంగా పాటించాలని, పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాన్ని ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ఆదేశించారు. పూడూరు మండలం కంకల్ గ్రామంలో బృందావనం స్పిరిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిస్టిలరీస్‌ ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం తనిఖీ చేశారు. హోల్డింగ్ ట్యాంక్స్, బ్లెండింగ్ యూనిట్, బాటిల్ ఫిల్లింగ్, సీసీ కెమెరాలు లు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం ను క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం తయారీ, ఉత్పత్తి, సరఫరా, లేబ్లింగ్, మద్యం తయారీకి చెందిన ముడి సరుకు, ఇతర సాంకేతికపరమైన తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా మద్యం తయారి చేస్తున్నరా లేదా అనే విషయాలు ఆరా తీసేందుకే కంపెనీలో ఆకస్మిక తనిఖీలు చేశామని రికార్డులు కూడా పరిశీలించామని అన్నారు. డిస్టిలరీలు, బేవరేజ్ లో లిక్కర్ తయారీకి ముడి సరుకు దగ్గర నుంచి బాటిల్ బయట వచ్చే వరకు ఆబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది? మద్యాన్ని భర్తీ చేసే క్రమంలో లేబ్లింగ్ ఎలా చేస్తున్నారు? ముడి సరుకు, ఉత్పత్తి అవుతున్న మద్యం, అక్కడ నుంచి డిపోలకు సరఫరా అవుతున్న లిక్కర్ రికార్డులను పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్, అసిస్టెంట్ కమీషనర్ డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story