- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jupalli: ముంచెత్తుతున్న వరద.. అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద ముంచెత్తుతోంది

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద (Adilabad floods) ముంచెత్తుతోంది. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్ గంగా ఉద్ధృతంగా ఉన్నందున ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, వరద ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆర్ డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో గురించి మంత్రి ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులకు కాల్వలకు గండ్లు పడితే వెంటే వాటిని పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.






