- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్పీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
by GSrikanth |
పేపర్ లీకేజీల కారణంగా ఇదివరకు రద్దు చేసిన జూనియర్ లెక్చరర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీకేజీల కారణంగా ఇదివరకు రద్దు చేసిన జూనియర్ లెక్చరర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 8 వ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించబోతున్నట్లు బోర్డు ప్రకటించింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా బోర్డు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ పద్దతిలోనే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
Next Story






