- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : జూడాల సమ్మె విరమణ
తెలంగాణ జూనియర్ డాక్టర్లు(Junior Doctors) తమ సమ్మెను విరమించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జూనియర్ డాక్టర్లు(Junior Doctors) తమ సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో వారు జరిపిన చర్చలు సఫలం అయిన నేపథ్యంలో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నామని జూడాలు ప్రకటించారు. తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని లేదంటే జూన్ 30 నుంచి ధర్నాకు దిగుతామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి నాలుగు రోజుల క్రితం సమ్మె నోటీసు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Minister Damodara Rajanarasimha) జూడాలను నేడు చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ముందే ప్రభుత్వం మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ(Stipend Increased) ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే కాలేజీల్లో, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలికసదూపాయాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వంతో తమ చర్చలు సఫలం అయ్యాయని జూడాలు పేర్కొన్నారు.
Read More : మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచిన ప్రభుత్వం






